రష్యాలో వాట్సాప్‌పై నిషేధం పుతిన్ సర్కార్ సంచలన నిర్ణయం
February 13, 2026

మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను రష్యాలో పూర్తిగా నిషేధిస్తూ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా చట్టాలను మెటా ఉల్లంఘిస్తోందని, ప్రభుత్వ ఆదేశాలను పాటించడం లేదని మాస్కౌ స్పష్టం చేసింది. అమెరికా ఒత్తిళ్లకు ప్రతిచర్యగా ఈ నిర్ణయాన్ని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రష్యాలో వాట్సాప్‌కు సంబంధించిన అన్ని డొమైన్లను తొలగించడం జరిగింది.
దీనికి ప్రత్యామ్నాయంగా స్థానిక ప్లాట్‌ఫారమ్ ‘మ్యాక్స్’ (MAX)ను వాడాలని ప్రభుత్వం పౌరులకు సూచించింది. ఇది ప్రభుత్వ కార్యకలాపాలను సులభతరం చేస్తుందని అధికారులు చెబుతుండగా, ఇది ప్రజలపై నిఘా ఉంచే యాప్ అని విమర్శకులు వాదిస్తున్నారు. రష్యా చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు.