ప్రేమిస్తే 31 వేలు పెళ్లి చేసుకుంటే 25 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం
December 29, 2025

దక్షిణ కొరియాలో వేగంగా తగ్గిపోతున్న జనాభా రేటును అరికట్టడానికి ఆ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యువతలో వివాహం మరియు పిల్లల పట్ల ఆసక్తి తగ్గడం వల్ల అక్కడ జనన రేటు కనిష్ట స్థాయికి పడిపోయింది. దీనివల్ల వృద్ధుల సంఖ్య పెరిగి, కుటుంబాల సంఖ్య క్షీణిస్తోంది. ఈ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి యువతను ప్రోత్సహిస్తూ భారీ నగదు ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది.
ప్రభుత్వ కొత్త ప్రణాళిక ప్రకారం, డేటింగ్‌కు వెళ్లే యువతీ యువకులకు సుమారు 31 వేల రూపాయలు మరియు పెళ్లి చేసుకునే వారికి ఏకంగా 25 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందజేస్తారు. దేశ భవిష్యత్తును కాపాడటానికి మరియు యువతను కుటుంబ వ్యవస్థ వైపు మళ్లించడానికి దక్షిణ కొరియా ప్రభుత్వం ఈ వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. దీని ద్వారా జనాభా సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చని అధికారులు భావిస్తున్నారు.