ప్రియాంక గాంధీ కుమారుడు రెహాన్ వధ్రా నిశ్చితార్థం ఆ ఏడేళ్ల ప్రేమకు పచ్చజెండా

ప్రియాంక గాంధీ కుమారుడు రెహాన్ వధ్రా నిశ్చితార్థం ఆ ఏడేళ్ల ప్రేమకు పచ్చజెండా

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, రాబర్ట్ వధ్రాల కుమారుడు రెహాన్ వధ్రా తన చిరకాల ప్రేయసి అబీబా బెగ్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట, త్వరలో వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇటీవల రెహాన్ తన ప్రేమను వ్యక్తపరచగా, అబీబా సానుకూలంగా స్పందించారు. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు ఇప్పటికే తమ అంగీకారాన్ని తెలియజేసినట్లు సమాచారం.

ఢిల్లీకి చెందిన అబీబా కుటుంబం మరియు వధ్రా కుటుంబం ఈ వేడుకను అత్యంత సన్నిహితుల మధ్య నిర్వహించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన వీరి ప్రేమ కథ త్వరలో పెళ్లి పీటల వరకు చేరుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, నిశ్చితార్థం ముగిసినప్పటికీ వివాహ తేదీపై మాత్రం కుటుంబ సభ్యుల నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *