పెళ్లి చేసుకోవాలని ప్రియురాలి అత్తగారి ఇంటికి వచ్చిన ప్రేమికుడు కానీ కాదన్న వివాహిత
December 30, 2025

జల్పాయిగురి జిల్లాలోని గడంగ్ సత్వేండి గ్రామంలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. ఒక వివాహితను పెళ్లి చేసుకుంటానంటూ ఆమె ప్రియుడు ఏకంగా ఆమె అత్తగారి ఇంటికే వచ్చాడు. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న తమ రహస్య బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలని అతను పట్టుబట్టాడు. అయితే, ఆ మహిళ మాత్రం తాను తన భర్త మరియు ఇద్దరు పిల్లలతోనే ఉంటానని, ప్రియుడు తనకు వద్దని ఖరాఖండిగా చెప్పేసింది.
ఈ పరిణామంతో గ్రామంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసినప్పటికీ, పిల్లల భవిష్యత్తు కోసం ఆమెను వదులుకోనని భర్త స్పష్టం చేశాడు. సమాచారం అందుకున్న ధుప్గురి పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు మరియు విచారణ నిమిత్తం ప్రియుడు, మహిళను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.