పిల్లల ట్యూషన్ మాస్టర్ తో భార్య పరారీ వీడియో షేర్ చేసిన భర్త

పిల్లల ట్యూషన్ మాస్టర్ తో భార్య పరారీ వీడియో షేర్ చేసిన భర్త

తన ఇద్దరు పిల్లలను మరియు భర్తను వదిలేసి పిల్లల ట్యూషన్ మాస్టర్ తో ఒక వివాహిత పరారైన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనీష్ తివారీ అనే వ్యక్తి తన భార్య రోష్ని రాణి మరియు ట్యూషన్ మాస్టర్ శుభమ్ కుమార్ మెహతా మధ్య ఉన్న వివాహేతర సంబంధం గురించి వీడియో ద్వారా వెల్లడించారు. పిల్లలకు చదువు చెప్పడానికి ఇంటికి వచ్చే మాస్టర్ తన భార్యను తీసుకెళ్లిపోయాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంట్లో ఎటువంటి గొడవలు లేకపోయినా భార్య ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తనను షాక్ కు గురిచేసిందని మనీష్ తెలిపారు. నమ్మకద్రోహానికి పాల్పడిన తన భార్యను తిరిగి చేరదీసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఒక గురువుగా ఉండి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన సదరు టీచర్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *