మీ పెరట్లో ఈ మొక్కలు పెంచుతున్నారా అయితే జాగ్రత్త విషసర్పాలకు ఇవి స్వర్గధామాలు

మీ పెరట్లో ఈ మొక్కలు పెంచుతున్నారా అయితే జాగ్రత్త విషసర్పాలకు ఇవి స్వర్గధామాలు

చాలామందికి మొక్కలు పెంచడం అలవాటు ఉంటుంది కానీ కొన్ని రకాల మొక్కలు విష సర్పాలను అయస్కాంతంలా ఆకర్షిస్తాయని మీకు తెలుసా. చందనం, నిమ్మ, మల్లె, సైప్రస్ మరియు దేవదారు వంటి చెట్లు పాములకు ఇష్టమైన నివాసాలుగా మారుతున్నాయి. ఈ చెట్ల సువాసన మరియు దట్టమైన ఆకులు కీటకాలను ఆకర్షించడమే కాకుండా, వాటిని వేటాడేందుకు వచ్చే పాములకు సురక్షితమైన ఆశ్రయాన్ని కల్పిస్తాయి.

ఐవీ మరియు దట్టమైన గడ్డి వంటి మొక్కలు తేమను కలిగి ఉండి ఎలుకలు, కప్పలకు నిలయంగా ఉంటాయి. దీంతో ఆహారం కోసం పాములు సులభంగా మీ ఇంటి పరిసరాల్లోకి వచ్చే అవకాశం ఉంది. పాములు సహజంగానే మనుషులకు దూరంగా ఉండాలని కోరుకున్నా, ఇలాంటి అనుకూల వాతావరణం ఉన్న చోట అవి తిష్ట వేస్తాయి. అందుకే మీ తోటలో ఈ మొక్కలను నాటడానికి ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించడం శ్రేయస్కరం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *