కోటిన్నర జనాభా ఉన్న ఆ దేశంలో కేవలం ఒక్కటే మద్యం షాపు ఉంది ఎందుకో తెలుసా
December 19, 2025

సుమారు 3.5 కోట్ల జనాభా కలిగిన సౌదీ అరేబియాలో దశాబ్దాల నిషేధం తర్వాత రాజధాని రియాద్‌లో కేవలం ఒకే ఒక్క మద్యం దుకాణం ప్రారంభమైంది. అయితే ఇది అందరి కోసం కాదు. కేవలం ముస్లిమేతర విదేశీ దౌత్యవేత్తలు మరియు నిర్దిష్ట నిబంధనలను పాటించే ముస్లిమేతర విదేశీయులకు మాత్రమే ఇక్కడ మద్యం కొనుగోలు చేసే అవకాశం ఉంది. సాధారణ పౌరులకు ఈ దుకాణంలోకి అనుమతి లేదు.
ఇక్కడ మద్యం కొనాలంటే నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. ఏడాదికి కనీసం 13,300 అమెరికన్ డాలర్ల ఆదాయం ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులు. కొనుగోలుదారులు తమ ఆదాయ ధృవీకరణ పత్రాలను చూపించడంతో పాటు, మొబైల్ యాప్ ద్వారా ముందస్తు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం జారీ చేసే ప్రత్యేక క్లియరెన్స్ కోడ్ ఉంటేనే నెలవారీ పరిమితికి లోబడి మద్యం విక్రయిస్తారు.