పాత వాహనాలపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
December 18, 2025

ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తన పాత ఉత్తర్వులను సవరించింది. వాహనాల వయస్సు ఆధారంగా కాకుండా, వాటి ఉద్గార ప్రమాణాల ఆధారంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా BS-IV ప్రమాణాల కంటే తక్కువ ఉన్న వాహనాలపైనే ఇకపై కఠిన చర్యలు ఉంటాయని కోర్టు వెల్లడించింది.
టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ కాలుష్యానికి ప్రధాన కారణమని కోర్టు అభిప్రాయపడింది. టోల్ ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని పేర్కొంది. అలాగే, నిర్మాణ పనుల నిలిపివేతతో ఉపాధి కోల్పోయిన కార్మికుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.