న్యూ ఇయర్ వేడుకలపై గిగ్ వర్కర్ల సమ్మె ప్రభావం డెలివరీ యాప్స్ నమ్ముకుంటే కష్టమే
December 31, 2025

కొత్త ఏడాది వేడుకల వేళ వినియోగదారులకు డెలివరీ కష్టాలు తప్పేలా లేవు. మెరుగైన వేతనాలు మరియు భద్రత కోరుతూ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ సర్వీస్ వర్కర్ల యూనియన్ నేడు డిసెంబర్ 31న సమ్మెకు పిలుపునిచ్చింది. తెలంగాణ గిగ్ వర్కర్ల యూనియన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమ్మె కారణంగా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఫుడ్ మరియు గ్రాసరీ డెలివరీ సేవలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది.
దాదాపు లక్షన్నర మంది డెలివరీ బాయ్స్ ఈ నిరసనలో పాల్గొంటున్నట్లు సమాచారం. చివరి నిమిషంలో ఆర్డర్లు క్యాన్సిల్ అవ్వడం లేదా డెలివరీ ఆలస్యం కావడం వంటి ఇబ్బందులు తలెత్తవచ్చు. అందుకే వేడుకలకు కావలసిన వస్తువులను ఇప్పుడే సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డెలివరీ యాప్‌లపై ఆధారపడకుండా నేరుగా దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేయడం ద్వారా కొత్త సంవత్సర వేడుకలను ఎలాంటి ఆటంకం లేకుండా జరుపుకోవచ్చు.