దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏది? ఆన్సర్ తెలిస్తే షాక్ అవుతారు!

భారతదేశంలోనే అతిపెద్ద మరియు అత్యంత రద్దీగల రైల్వే జంక్షన్ పశ్చిమ బెంగాల్‌లోని హౌరా స్టేషన్. ఇది అత్యంత పురాతన స్టేషన్లలో ఒకటిగా ఉండటమే కాకుండా, దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతిరోజూ 600కు పైగా రైళ్లు నడుస్తాయి మరియు పది లక్షలకు పైగా ప్రజలు రాకపోకలు సాగిస్తారు. హుగ్లీ నది పశ్చిమ ఒడ్డున ఉన్న ఈ స్టేషన్లో మొత్తం 23 ప్లాట్‌ఫారమ్‌లు మరియు 26 రైలు మార్గాలు ఉన్నాయి.
1854లో ఈస్ట్ ఇండియా కంపెనీచే నిర్మించబడిన ఈ చారిత్రక స్టేషన్ నేటికీ తన వైభవాన్ని చాటుతోంది. దాని అందంతో పాటు, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు దేశంలో అత్యంత ముఖ్యమైన రవాణా కేంద్రాలలో ఒకటిగా దీనిని మార్చాయి. అంతేకాకుండా, బంగ్లాదేశ్‌తో నేరుగా రైలు అనుసంధానం చేసే మైత్రీ ఎక్స్‌ప్రెస్ ఇక్కడి నుంచే నడుస్తుంది, ఇది హౌరా జంక్షన్‌కు మరింత ప్రత్యేకతను ఇచ్చింది.