RAC టికెట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ రైల్వే కొత్త రూల్స్ తో మీ సీటు ఖచ్చితంగా కన్ఫర్మ్!

RAC టికెట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ రైల్వే కొత్త రూల్స్ తో మీ సీటు ఖచ్చితంగా కన్ఫర్మ్!

భారతీయ రైల్వేలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా, చాలామందికి RAC (Reservation Against Cancellation) టికెట్‌లు లభిస్తాయి. RAC అంటే మీకు రైలులో ప్రయాణించడానికి అనుమతి ఉంది, కానీ పూర్తి బెర్త్ కాకుండా తోటి ప్రయాణీకుడితో సగం సీటును పంచుకోవాలి. అయితే, ప్రయాణం ప్రారంభమైన తర్వాత కూడా మీ RAC టికెట్‌ పూర్తి సీటుగా నిర్ధారించబడటానికి ఒక ముఖ్యమైన నియమం ఉంది.

రైలు కదిలిన తర్వాత, రైలు టికెట్ ఎగ్జామినర్ (TTE) మొదటగా ఎంతమంది కన్ఫర్మ్ ప్రయాణికులు రాలేదో (నో-షో) లేదా ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారో చూస్తారు. అలాగే, ఒక కన్ఫర్మ్ ప్రయాణికుడు మధ్య స్టేషన్‌లో దిగిపోతే, ఆ సీటు కూడా ఖాళీ అవుతుంది. రైల్వే నిబంధనల ప్రకారం, ఈ ఖాళీ అయిన పూర్తి సీట్లను మొదట RAC ప్రయాణికులకు కేటాయిస్తారు. ఎవరి RAC సంఖ్య తక్కువగా ఉంటే, వారికి మొదట పూర్తి సీటు లభిస్తుంది. ఉదాహరణకు, RAC 1 ప్రయాణికుడికి RAC 2 కంటే ముందుగా పూర్తి బెర్త్ కేటాయించబడుతుంది, తద్వారా మీరు ఎవరితోనూ సీటు పంచుకోవాల్సిన అవసరం ఉండదు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *