తరచూ మూత్ర విసర్జన సమస్యతో ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడం అనేది డయాబెటిస్, ఇన్ఫెక్షన్ లేదా తక్కువగా నీరు తాగడం వల్ల సంభవించవచ్చు. ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగడం ఎంతో ముఖ్యం. నీటిలో నిమ్మరసం లేదా పుదీనా కలిపి తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అలాగే యాంటీ బాక్టీరియల్ గుణాలున్న వెల్లుల్లి మరియు కొబ్బరి నీళ్లను రోజూ తీసుకోవడం వల్ల మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గి, సమస్య త్వరగా నయమవుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఈ సమస్యను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తాజా పండ్ల రసాలు మరియు ఆకుకూరలు తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. అయితే ఇన్ఫెక్షన్ ఉన్న సమయంలో తీపి పదార్థాలు, కేకులు, కాఫీ మరియు మసాలా వంటకాలకు దూరంగా ఉండాలి. ఇవి బ్యాక్టీరియా పెరగడానికి కారణమై సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. కాబట్టి సరైన ఆహారం తీసుకుంటూ ఈ ఇబ్బంది నుండి బయటపడవచ్చు.