అమెరికా నుండి వచ్చి 12 ఏళ్ల క్రితం తీసుకున్న వేరుశనగ గింజల అప్పు తీర్చిన అరుదైన ఘటన

అమెరికా నుండి వచ్చి 12 ఏళ్ల క్రితం తీసుకున్న వేరుశనగ గింజల అప్పు తీర్చిన అరుదైన ఘటన

2010లో యూ కొత్తపల్లి బీచ్‌లో పర్సు మర్చిపోయి వేరుశనగలు తిన్న నేమాని ప్రణవ్, సుచిత అనే అన్నాచెల్లెళ్లు తమ కృతజ్ఞతను చాటుకున్నారు. అప్పట్లో సత్తయ్య అనే వ్యాపారి ఉచితంగా వేరుశనగలు ఇవ్వగా, అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత వారు ఆ అప్పు తీర్చాలని నిర్ణయించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే సహాయంతో సత్తయ్య ఆచూకీ కోసం ప్రయత్నించగా, అతను మరణించినట్లు తెలిసింది.

దీంతో సత్తయ్య కుటుంబ సభ్యులను వెతుక్కుంటూ వారి స్వగ్రామానికి వెళ్లిన ప్రణవ్, సుచిత వారికి 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. దశాబ్దం దాటినా తమకు ఆపదలో సాయం చేసిన వ్యక్తిని గుర్తుంచుకుని, అతని కుటుంబానికి అండగా నిలవడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మానవీయ కోణం నెటిజన్ల మనసు గెలుచుకుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *