గౌతమ్ గంభీర్ అవుట్ టీమిండియా టెస్ట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న ఆ భారత దిగ్గజం

గౌతమ్ గంభీర్ అవుట్ టీమిండియా టెస్ట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న ఆ భారత దిగ్గజం

భారత టెస్ట్ జట్టు కోచ్‌గా గౌతమ్ గంభీర్ ప్రస్థానం ముగియనున్నట్లు తెలుస్తోంది. గంభీర్ పర్యవేక్షణలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతుల్లో క్లీన్ స్వీప్ అవడంతో పాటు ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కోల్పోవడం బీసీసీఐని ఆలోచనలో పడేసింది. గంభీర్ కోచింగ్‌లో ఆడిన 19 టెస్టుల్లో భారత్ 10 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వడం గమనార్హం. దీంతో టెస్ట్ ఫార్మాట్ కోసం ప్రత్యేక కోచ్‌ను నియమించాలని బోర్డు భావిస్తోంది.

ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్‌ను బీసీసీఐ సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో హెడ్‌గా ఉన్న లక్ష్మణ్, పూర్తిస్థాయి కోచ్ బాధ్యతలు తీసుకోవడానికి అంతగా సుముఖంగా లేరని సమాచారం. మరి లక్ష్మణ్‌ను బోర్డు ఒప్పిస్తుందా లేదా మరో కొత్త కోచ్ కోసం అన్వేషణ మొదలుపెడుతుందా అనేది వేచి చూడాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *