గంభీర్ కోచ్ పదవికి ముప్పు లక్ష్మణ్ నో చెప్పడంతో తృటిలో తప్పిన గండం

గంభీర్ కోచ్ పదవికి ముప్పు లక్ష్మణ్ నో చెప్పడంతో తృటిలో తప్పిన గండం

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తు ఇప్పుడు సందిగ్ధంలో పడింది. సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమ్ ఇండియా ఘోర పరాజయం పాలవ్వడంతో గంభీర్ పనితీరుపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తితో ఉంది. పిటిఐ నివేదిక ప్రకారం, గంభీర్‌ను తొలగించి వివిఎస్ లక్ష్మణ్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలని బోర్డు భావించినప్పటికీ, లక్ష్మణ్ ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు.

ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ బాధ్యతల్లో ఉన్న లక్ష్మణ్, ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. దీంతో గంభీర్‌కు మరో అవకాశం లభించినట్లయింది. అయితే జట్టు ప్రదర్శన మెరుగుపడకపోతే మేనేజ్‌మెంట్ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం గంభీర్ పదవి లక్ష్మణ్ తీసుకున్న నిర్ణయం వల్ల మాత్రమే సురక్షితంగా ఉందని క్రీడా వర్గాల సమాచారం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *