కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్ అవుట్ ఆ ప్రచారంలో నిజం లేదన్న బీసీసీఐ

కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్ అవుట్ ఆ ప్రచారంలో నిజం లేదన్న బీసీసీఐ

భారత టెస్టు జట్టు కోచ్‌గా గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు బీసీసీఐ తెరదించింది. గంభీర్ స్థానంలో వివిఎస్ లక్ష్మణ్‌ను కోచ్‌గా నియమిస్తున్నారనే వార్తలు అవాస్తవమని బోర్డు స్పష్టం చేసింది. గంభీర్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని, 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆయనే కోచ్‌గా కొనసాగుతారని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. లక్ష్మణ్‌తో ఎలాంటి అధికారిక చర్చలు జరపలేదని బోర్డు క్లారిటీ ఇచ్చింది.

టెస్టుల్లో గంభీర్ హయాంలో భారత్ ఎదుర్కొన్న ఓటముల వల్ల ఆయన పదవికి ముప్పు వాటిల్లిందని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా స్వదేశంలో జరిగిన టెస్టుల్లో వైఫల్యాలు క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే ప్రస్తుతానికి గంభీర్ తన స్థానాన్ని సురక్షితంగానే ఉంచుకున్నట్లు కనిపిస్తోంది. బోర్డులోని కీలక సభ్యుల మద్దతు ఉండటంతో వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని గంభీర్ తన ప్రస్థానాన్ని కొనసాగించే అవకాశం ఉంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *