న్యూజిలాండ్ వన్డే సిరీస్ జట్టులో పెను మార్పులు రిషబ్ పంత్ అవుట్ ఇషాన్ కిషన్ ఇన్

న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం టీమ్ ఇండియాను ఎంపిక చేసే విషయంలో బిసిసిఐ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. విజయ్ హజారే ట్రోఫీ ప్రదర్శనను బట్టి జనవరి 2 నుండి 4 మధ్య జట్టును ప్రకటించే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకున్న శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా తిరిగి రానుండటంతో యశస్వి జైస్వాల్ లేదా రుతురాజ్ గైక్వాడ్‌లలో ఒకరు బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.
ముఖ్యంగా వికెట్ కీపర్ స్థానంలో రిషబ్ పంత్‌ను తప్పించి ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకోవాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న ఇషాన్ చాలా కాలం తర్వాత వన్డే ఫార్మాట్‌లోకి రాబోతున్నాడు. జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. బౌలింగ్ విభాగంలో పెద్దగా మార్పులు లేకపోయినా మహమ్మద్ సిరాజ్ ఎంపికపై అందరి దృష్టి నెలకొంది.