ఆపరేషన్ తర్వాత మాతృభాషను మర్చిపోయిన బాలుడు విదేశీ భాషలో మాట్లాడుతూ షాక్ ఇచ్చిన వైనం

ఆపరేషన్ తర్వాత మాతృభాషను మర్చిపోయిన బాలుడు విదేశీ భాషలో మాట్లాడుతూ షాక్ ఇచ్చిన వైనం

నెదర్లాండ్స్‌కు చెందిన ఒక 17 ఏళ్ల బాలుడికి మోకాలి శస్త్రచికిత్స తర్వాత వైద్యులు ఊహించని సంఘటన ఎదురైంది. ఫుట్‌బాల్ ఆడుతూ గాయపడిన ఆ బాలుడు ఆపరేషన్ తర్వాత స్పృహలోకి రాగానే తన మాతృభాష డచ్‌ను మర్చిపోయి ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. తాను అమెరికాలో నివసిస్తున్నట్లు చెబుతూ తన తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేకపోయాడు. వైద్య శాస్త్రంలో అత్యంత అరుదైన ‘ఫారిన్ లాంగ్వేజ్ సిండ్రోమ్’ వల్ల ఇలా జరిగిందని డాక్టర్లు నిర్ధారించారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటి కేసులు కేవలం తొమ్మిది మాత్రమే నమోదయ్యాయి. సుమారు 18 గంటల తర్వాత తన స్నేహితులను కలిసినప్పుడు ఆ బాలుడు మళ్లీ నెమ్మదిగా డచ్ భాషను మాట్లాడటం ప్రారంభించాడు. ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. టీనేజ్ వయసులో ఉన్నవారిలో ఇటువంటి వింత సిండ్రోమ్ కనిపించడం ఇదే మొదటిసారి కావచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *