సూర్యకు షాక్? టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా చేతికి టీమ్ ఇండియా పగ్గాలు!
December 20, 2025

టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టులో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ ఫామ్ లేమితో సతమతమవుతుండటంతో బిసిసిఐ పునరాలోచనలో పడింది. ఈ కీలక టోర్నీలో హార్దిక్ పాండ్యాను మళ్లీ కెప్టెన్‌గా నియమించాలని సెలక్టర్లు భావిస్తున్నారు.
బిసిసిఐ వర్గాల సమాచారం ప్రకారం, హార్దిక్ గత రికార్డులు మరియు ఐపీఎల్ అనుభవం పరిగణనలోకి తీసుకోనున్నారు. భారత్ తరపున 16 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన ఆయన 11 విజయాలు అందించారు. ఈ కీలక నిర్ణయం ప్రపంచకప్ వేటలో టీమ్ ఇండియాకు కీలకం కానుంది.