నేడే భారత్-పాక్ ఫైనల్ పోరు: పాకిస్థాన్‌కు చుక్కలు చూపించనున్న ఆ 5 గురు టీమ్ ఇండియా స్టార్స్!

నేడే భారత్-పాక్ ఫైనల్ పోరు: పాకిస్థాన్‌కు చుక్కలు చూపించనున్న ఆ 5 గురు టీమ్ ఇండియా స్టార్స్!

దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో నేడు జరగనున్న అండర్-19 ఆసియా కప్ హై-వోల్టేజ్ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఆయుష్ మాత్రే నాయకత్వంలోని టీమ్ ఇండియా, సెమీఫైనల్‌లో శ్రీలంకను ఓడించి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోరులో, గ్రూప్ దశలో ఇప్పటికే పాక్‌ను ఓడించిన భారత్ మరోసారి టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉంది.

బ్యాటింగ్‌లో వైభవ్ సూర్యవంశీ, అత్యధిక పరుగులు చేసిన అభిజ్ఞాన్ కుందు భారత జట్టుకు వెన్నెముకగా నిలిచారు. మిడిల్ ఆర్డర్‌లో ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా పటిష్టంగా ఉండగా, బౌలింగ్‌లో దీపేష్ దేవేంద్రన్ పాకిస్థాన్‌కు ప్రధాన ముప్పుగా మారనున్నారు. గత మ్యాచ్‌లో పాక్‌పై 3 వికెట్లు తీసిన దీపేష్‌తో పాటు ఈ ఐదుగురు స్టార్ ఆటగాళ్లు భారత్‌కు విజయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *