5 నెలలుగా జీతం లేదు! రన్‌వేపై విమానం ఆపి పైలట్ నిరసన; కంగుతిన్న ప్రయాణికులు!
December 21, 2025

మెక్సికో సిటీలోని బెనిటో జువారెజ్ విమానాశ్రయంలో ఒక పైలట్ తన బకాయిల కోసం వినూత్న నిరసన చేపట్టారు. ఐదు నెలలుగా జీతం మరియు ప్రయాణ ఖర్చులు చెల్లించకపోవడంతో కాంకున్ వెళ్లాల్సిన విమానాన్ని నడపడానికి ఆయన నిరాకరించారు. ముగ్గురు పిల్లల తండ్రి అయిన తనకు న్యాయం జరిగే వరకు విమానాన్ని కదిలించబోనని ప్రయాణికులకు స్పష్టం చేస్తూ కాక్‌పిట్‌లో తనను తాను బంధించుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పౌర విమానయాన శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించి, సదరు పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై మెక్సికో విమానాశ్రయ అధికారులు సమగ్ర విచారణ ప్రారంభించారు.