2026లో ఈ 6 రాశులపై శని ప్రభావం! గండం నుండి గట్టెక్కేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
December 21, 2025

2026లో శని దేవుడు మీన రాశిలోకి ప్రవేశించనుండటంతో ద్వాదశ రాశులపై ప్రభావం చూపనుంది. మేష, సింహ, ధనుస్సు రాశుల వారికి శని ‘లోహ పాదం’ కావడం వల్ల కఠిన శ్రమ, బాధ్యతలు పెరుగుతాయి. వృషభ, తులా, మీన రాశుల వారికి ‘స్వర్ణ పాదం’ అమలవుతుంది. ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించడం ఎంతో శ్రేయస్కరం.
శని ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి శనివారం నాడు ఆవనూనె, ఇనుప వస్తువులను దానం చేయాలి. క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించడం, పసుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల మానసిక బలం చేకూరుతుంది. ఉద్యోగ రంగంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ, షార్ట్కట్ పద్ధతులు అనుసరించకుండా సహనంతో వ్యవహరించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.