అహ్మదాబాద్‌లో కలకలం! సంజూ షాట్‌కు కుప్పకూలిన అంపైర్, హార్దిక్ హిట్‌తో కెమెరామెన్‌కు గాయం
December 20, 2025

భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఐదో టీ20లో అహ్మదాబాద్ మైదానం ఊహించని ఘటనలకు వేదికైంది. సంజూ శామ్సన్ బాదిన బంతి అంపైర్ రోహన్ పండిట్ మోకాలికి బలంగా తగలడంతో ఆయన మైదానంలోనే కుప్పకూలారు. మెడికల్ టీమ్ చికిత్స అందించే వరకు సుమారు ఐదు నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది.
మరోవైపు, హార్దిక్ పాండ్యా కొట్టిన భారీ షాట్ బౌండరీ అవతల ఉన్న కెమెరామెన్ చేతికి బలంగా తగిలింది. డగౌట్ వైపు కెమెరా ఫోకస్ చేసి ఉండటంతో ఆయన బంతిని గమనించలేకపోయారు. వెంటనే ఐస్ ప్యాక్స్‌తో చికిత్స అందించడంతో ఆయన కోలుకున్నారు.