అమెరికా సైనికులపై దాడికి ట్రంప్ ప్రతీకారం: సిరియాలో ‘ఆపరేషన్ హాక్ ఐ స్ట్రైక్’ ప్రారంభం

అమెరికా సైనికులపై దాడికి ట్రంప్ ప్రతీకారం: సిరియాలో ‘ఆపరేషన్ హాక్ ఐ స్ట్రైక్’ ప్రారంభం

సిరియాలోని పాల్మిరాలో ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు, ఒక అనువాదకుడు మరణించారు. దీనికి ప్రతిచర్యగా అమెరికా ‘ఆపరేషన్ హాక్ ఐ స్ట్రైక్’ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా అమెరికా యుద్ధ విమానాలు సిరియాలోని సుమారు 70 ఉగ్రవాద స్థావరాలను, ఆయుధ డిపోలను ధ్వంసం చేశాయి.

అమెరికా పౌరులపై దాడి చేస్తే ప్రపంచంలో ఎక్కడున్నా వదిలిపెట్టబోమని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఉగ్రవాదులను వేటాడి కఠినంగా శిక్షిస్తామని రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ స్పష్టం చేశారు. ఈ దాడులు మరింత తీవ్రతరం కానున్నాయని అమెరికా వర్గాలు తెలిపాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *