శుభ్‌మన్ గిల్ అవుట్.. షాక్‌లో సునీల్ గవాస్కర్, ‘దృష్టి’ తగిలిందంటూ సంచలన వ్యాఖ్యలు!

శుభ్‌మన్ గిల్ అవుట్.. షాక్‌లో సునీల్ గవాస్కర్, ‘దృష్టి’ తగిలిందంటూ సంచలన వ్యాఖ్యలు!

టీ20 ప్రపంచకప్ జట్టు నుంచి శుభ్‌మన్ గిల్‌ను తప్పించడంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గిల్ ఫామ్ తాత్కాలికమేనని, అతను ఒక ‘క్లాసీ’ ప్లేయర్ అని వెనకేసుకొచ్చారు. గిల్‌కు ఎవరో ‘దృష్టి’ పెట్టారని, అందుకే అతనికి వింత గాయాలు అవుతున్నాయని గవాస్కర్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఇంట్లో దిష్టి తీయించుకోవాలని కూడా ఆయన సూచించారు.

అయితే, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఈ నిర్ణయంపై స్పందిస్తూ.. ఫామ్ వల్ల కాదు, కేవలం టీమ్ కాంబినేషన్ కోసమే గిల్‌ను పక్కన పెట్టామని స్పష్టం చేశారు. జట్టు సమతుల్యత కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవని పేర్కొన్నారు. మేనేజ్‌మెంట్ వివరణ ఎలా ఉన్నా, ఒక ప్రతిభావంతైన ఆటగాడిని జట్టులోకి తీసుకోకపోవడంపై గవాస్కర్ అసంతృప్తిగా ఉన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *