మోదీ సభకు వెళ్తుండగా ఘోర ప్రమాదం! నదియాలో రైలు ఢీకొని నలుగురు దుర్మరణం

మోదీ సభకు వెళ్తుండగా ఘోర ప్రమాదం! నదియాలో రైలు ఢీకొని నలుగురు దుర్మరణం

నదియా జిల్లాలోని కృష్ణానగర్-రానాఘాట్ రైల్వే సెక్షన్‌లో శనివారం తెల్లవారుజామున రైలు ఢీకొని నలుగురు మృతి చెందారు. ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన వీరు ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు వచ్చారు. తెల్లవారుజామున రైల్వే ట్రాక్ సమీపంలో బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరో వ్యక్తి శక్తి నగర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి ముర్షిదాబాద్ నుండి బస్సులో బయలుదేరిన వీరు, తెల్లవారుజామున తహేర్‌పూర్ చేరుకున్నాక ఈ విషాదం జరిగింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *