బిగ్ షాక్! వేలం ముగిసిన వెంటనే అమ్మకానికి సిద్ధమైన ఛాంపియన్ కేకేఆర్?
December 20, 2025

ఐపీఎల్ 2026 వేలం ముగిసిన వెంటనే కోల్కతా నైట్ రైడర్స్ గురించి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. మూడుసార్లు ఛాంపియన్గా నిలిచిన కేకేఆర్ వాటాలను విక్రయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ తర్వాత ఈ జాబితాలో కోల్కతా మూడవ ఫ్రాంచైజీగా చేరింది.
మెహతా గ్రూప్ తన స్వల్ప వాటాను విక్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనివల్ల షారుఖ్ ఖాన్కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ యాజమాన్య నియంత్రణపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ ప్రక్రియ 2026 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.