SSC కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. ఫిబ్రవరి 23న జరగాల్సిన పరీక్ష వాయిదా

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కానిస్టేబుల్ (GD) అభ్యర్థులకు కీలక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPFs), SSF మరియు అస్సాం రైఫిల్స్‌లో ఖాళీగా ఉన్న 25,487 పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన ఈ పరీక్షను అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు కమిషన్ వెల్లడించింది.
వాయిదాకు కారణం మరియు కొత్త తేదీలు
వాస్తవానికి ఈ పరీక్ష ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కొన్ని సాంకేతిక మరియు పరిపాలనా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పరీక్షకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించనున్నట్లు SSC స్పష్టం చేసింది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేస్తూ ఉండాలి.
అడ్మిట్ కార్డుల వివరాలు
పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు అంటే మీకు ఏ నగరంలో పరీక్ష కేంద్రం కేటాయించారో తెలిపే వివరాలను పరీక్షకు 8 నుంచి 10 రోజుల ముందు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఇకపోతే పూర్తి వివరాలతో కూడిన హాల్ టికెట్లు లేదా అడ్మిట్ కార్డులను పరీక్ష తేదీకి కేవలం 2 నుంచి 3 రోజుల ముందు మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తామని కమిషన్ పేర్కొంది.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అప్రమత్తంగా ఉండి, కేవలం అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని అధికారులు సూచిస్తున్నారు.