క్యాతన్‌పల్లిలో హైటెన్షన్.. రణరంగంగా మారిన మున్సిపాలిటీ
February 18, 2026

మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కేంద్రంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. నిన్నటి రాళ్లదాడి ఘటనతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.
నేడు క్యాతన్‌పల్లి బంద్
పోలీసుల తీరును, కాంగ్రెస్ నాయకుల ప్రవర్తనను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేడు క్యాతన్‌పల్లి బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో పట్టణంలో భారీగా పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
బాల్క సుమన్‌పై కేసు నమోదు
నిన్నటి ఘర్షణల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ తరహా వాతావరణం కనిపిస్తోంది.