సొంత మరణం, అంత్యక్రియలపై నానా పటేకర్ సంచలన వ్యాఖ్యలు! ‘నా వెంట వచ్చేది ఆ కట్టెలే’
October 9, 2026

ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ తన మరణం మరియు అంత్యక్రియల ఏర్పాటుపై గతంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 2023లో ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమా సమయంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, తన చివరి ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే చేసుకున్నానని నవ్వుతూ చెప్పారు.
ఈ లోకాన్ని విడిచివెళ్లేటప్పుడు తన వెంట వచ్చే ఏకైక ఆస్తి కట్టెలేనని ఆయన వ్యాఖ్యానించారు. తన దహన సంస్కారాల కోసం ప్రత్యేకంగా 12 మణుల ఎండు కట్టెలను సిద్ధం చేసి ఉంచానని, తన అంత్యక్రియలకు తడి కట్టెలను ఉపయోగించవద్దని ఆయన స్పష్టం చేశారు.