మళ్లీ తగ్గిన పుత్తడి, వెండి ధరలు! పసిడి పైపైకి కాకుండా కిందకి, వెండిపై రూ.2,800 పైగా తగ్గింపు
October 9, 2026

దేశీయ మార్కెట్లో గురువారం కూడా బంగారం, వెండి ధరల తగ్గుదల ప్రక్రియ కొనసాగింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) సమాచారం ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.304 తగ్గి రూ.1,47,463 వద్ద నిలిచింది.
మరోవైపు వెండి ధర కూడా భారీగా పడిపోయింది. కిలో వెండి ధర రూ.2,821 తగ్గి రూ.2,18,045 కి చేరింది. పండగల సీజన్‌కు ముందు విలువైన లోహాల ధరలు తగ్గుతుండటంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.