మస్క్ పోస్ట్‌పై రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు! ‘స్టార్‌లింక్’ వివాదంలో అంబానీ, అదానీలపై విమర్శలు
October 9, 2026

భారత మార్కెట్లో ‘స్టార్‌లింక్’ ప్రవేశాన్ని పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఈ పరిణామంతో దేశీయ వ్యాపార, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
మస్క్ చేసిన పోస్ట్‌ను రీపోస్ట్ చేస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అదానీ గ్రూప్‌ను ఉద్దేశిస్తూ.. “ఇండియాకి స్వాగతం ఎలాన్! రెండో వ్యక్తి గురించి తెలిసే వరకు ఆగండి” అంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.