‘చనిపోయాక నా శవాన్ని కూడా రానివ్వరు’! కోల్‌కతా వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా
October 9, 2026

కోల్‌కతాలోని మహాజాతి సదన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణకు గురైన రచయిత్రి తస్లీమా నస్రీన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో భావప్రకటనా స్వేచ్ఛను కొనియాడిన ఆమె, తాను ఇక బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లలేననే సత్యాన్ని అంగీకరించినట్లు తెలిపారు.
ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, తన మరణానంతరం కూడా తన పార్థివ దేహాన్ని బంగ్లాదేశ్‌లోకి అనుమతించకపోవచ్చని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లోని ప్రతి ప్రభుత్వమూ ఉగ్రవాదులకు, మతమౌఢ్యానికి కొమ్ముకాస్తోందని ఆమె ఆరోపించారు.