రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు! రాముడు, శివుడిపై చేసిన కామెంట్స్‌తో రాజకీయ ప్రకంపనలు
September 29, 2026

బిజెపిపై విమర్శలు గుప్పించే క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాము ద్రవిడ జాతికి చెందినవారమని, శివుడు పేదల దేవుడు కాగా రాముడు ధనవంతుల దేవుడని పేర్కొన్నారు.
బిజెపి ధనవంతుల పార్టీ కాబట్టే హర్ హర్ మహాదేవ్ అని అనకుండా కేవలం జై శ్రీరామ్ అని మాత్రమే నినాదాలు చేస్తుందని ఆరోపించారు. దక్షిణాదిలో శివుడిని, ఉత్తరాదిలో రాముడిని ఎక్కువగా పూజిస్తారని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.