కామారెడ్డిలో పీక్స్‌కు చేరిన పొలిటికల్ వార్ నేడు కలెక్టర్ వద్ద తేల్చుకునేందుకు సిద్ధమైన నేతలు
February 23, 2026

కామారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూముల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే రమణా రెడ్డి సవాల్ విసరడంతో రాజకీయం వేడెక్కింది. నేడు ఇరు పార్టీల నేతలు కలెక్టర్ కార్యాలయానికి సాక్ష్యాలతో వస్తామని ప్రకటించడంతో జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
బీజేపీ ఎమ్మెల్యే సవాల్‌ను స్వీకరించిన కాంగ్రెస్ నేతలు ఆయన రాజీనామాకు సిద్ధపడాలని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. నేతలు కలెక్టరేట్‌కు వెళ్లకుండా అడ్డుకునే అవకాశం ఉండటంతో అరెస్టుల పర్వం కొనసాగే అవకాశం కనిపిస్తోంది.