రఫేల్ యుద్ధ విమానాల సోర్స్ కోడ్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన ఫ్రాన్స్ ప్రభుత్వం
February 23, 2026

భారతదేశానికి 114 రఫేల్ యుద్ధ విమానాల విక్రయానికి సంబంధించి జరుగుతున్న చర్చల్లో ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్ వంటి కీలక వ్యవస్థలకు సంబంధించిన ‘సోర్స్ కోడ్’లను బదిలీ చేసే ప్రతిపాదనను ఫ్రాన్స్ గట్టిగా తోసిపుచ్చింది. ఈ పరిమితుల వల్ల ఫ్రాన్స్ మద్దతు లేకుండా భారత్ స్వతంత్రంగా సొంత సెన్సార్లు లేదా ఆయుధాలను విమాన సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించే అవకాశం కోల్పోనుంది.
దశాబ్దాలుగా తాము అభివృద్ధి చేసిన ఈ సాంకేతికతను ఏ దేశంతోనూ పంచుకోలేమని ఫ్రాన్స్ స్పష్టం చేసింది. సోర్స్ కోడ్ లేకపోవడం వల్ల భారతీయ ఆయుధాల ప్రోగ్రామింగ్ వేగంగా జరగదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే పూర్తి సోర్స్ కోడ్‌కు బదులుగా ‘ప్లగ్ అండ్ ప్లే’ పద్ధతిలో ఏపీఐలను అందించే మధ్యేమార్గంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.