బీహార్లో స్టేజ్ షోలో దారుణం డాన్సర్ నోట్లో బలవంతంగా నాణేలు కుక్కిన ఆకతాయిలు
February 13, 2026

బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో అమానుష ఘటన వెలుగుచూసింది. వేదికపై డాన్సర్ ప్రదర్శన ఇస్తుండగా, కొంతమంది ప్రేక్షకులు ఒక్కసారిగా స్టేజ్ పైకి దూసుకెళ్లి ఆమె నోట్లో బలవంతంగా నాణేలను కుక్కారు. ఈ క్రమంలో ఆమె ఒక నాణేన్ని మింగేయడంతో ఊపిరి అందక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది.
బాధితురాలిని వెంటనే ఆరా సదర్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు శ్రమించి ఆమె గొంతులో చిక్కుకున్న నాణేన్ని బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, భద్రతా వైఫల్యాలపై మరియు ఈ అరాచకానికి పాల్పడిన వారిపై దర్యాప్తు ప్రారంభించారు.