అక్రమ సంబంధం బయటపడుతుందనే భయంతో అత్తను చంపిన కోడలు

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో వివాహేతర సంబంధం ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. హసన్పూర్ గ్రామానికి చెందిన జైనబ్ తన భర్త ఇంట్లో లేని సమయంలో పొరుగున ఉండే మెహర్ అలీతో సంబంధం పెట్టుకుంది. డిసెంబర్ 18 రాత్రి వీరిద్దరూ ఏకాంతంగా ఉండగా అత్త షమీమా కంటపడ్డారు. ఈ విషయం తన భర్తకు చెబితే పరువు పోతుందని భావించిన జైనబ్, తన ప్రియుడితో కలిసి అత్త గొంతు నులిమి హత్య చేసింది. మరుసటి రోజు ఉదయం మృతదేహాన్ని గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
పోస్టుమార్టం నివేదికలో గొంతు నులిమి చంపినట్లు తేలడంతో పోలీసులు కోడలు జైనబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. నిందితురాలు జైనబ్ మరియు ఆమె ప్రియుడు మెహర్ అలీని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అక్రమ సంబంధం కోసం సొంత అత్తనే కడతేర్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.