చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం

కొత్త ఏడాది వేళ దేశంలోని కోట్లాది మంది మధ్యతరగతి పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక శాఖ తీపి కబురు అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి (జనవరి-మార్చి 2026) గానూ పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిసెంబర్ 31న విడుదలైన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, పాత వడ్డీ రేట్లే మార్చి 31 వరకు కొనసాగుతాయి.

మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా వడ్డీ రేట్లు తగ్గుతాయని ప్రచారం జరిగినప్పటికీ, ప్రభుత్వం యథాతథ స్థితిని కొనసాగించింది. దీనివల్ల సుకన్య సమృద్ధి, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లపై గరిష్టంగా 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. పీపీఎఫ్‌పై 7.1 శాతం, ఎన్ఎస్‌సీపై 7.7 శాతం వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్నాయి. వరుసగా రెండో త్రైమాసికంలోనూ వడ్డీ రేట్లను మార్చకపోవడం ద్వారా సామాన్యుల పొదుపుపై రాబడికి ప్రభుత్వం భరోసా కల్పించింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *