కాన్పూర్ లో ఘోరం మొదటి భార్య చనిపోయిన ఇంట్లోనే రెండో భార్యను కొట్టి చంపిన భర్త
December 31, 2025

ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా రేవనా ప్రాంతంలో భర్త సంజయ్ కుమార్ తన రెండో భార్య రోషిణిని పెనంతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. పెళ్ళైన ఏడాది కాలం నుండే నిందితుడు ఆమెను శారీరక, మానసిక వేధింపులకు గురిచేసేవాడు. సోదరుడు రాహుల్ తన సోదరి ఫోన్ ఎత్తకపోవడంతో ఇంటికి వెళ్లి చూడగా, తాళం వేసి ఉన్న గదిలో రోషిణి రక్తపు మడుగులో పడి ఉంది.
నిందితుడు సంజయ్ గతంలో తన మొదటి భార్యను వేధించి, ఆమె ఆత్మహత్యకు కారణమై జైలుకు కూడా వెళ్ళాడు. జైలు నుండి వచ్చిన తర్వాత రోషిణిని రెండో వివాహం చేసుకున్న సంజయ్, మళ్ళీ అదే క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, డీసీపీ డీఎన్ చౌదరి నేతృత్వంలో ప్రత్యేక బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.