ప్రియుడితో కలిసి భర్త హత్యకు భార్య కుట్ర నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న వైనం

ప్రియుడితో కలిసి భర్త హత్యకు భార్య కుట్ర నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న వైనం

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఒక విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్య తనను చంపేందుకు కుట్ర పన్నిందని ఆరోపిస్తూ ఒక వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. పదేళ్ల క్రితం పెళ్లయి నలుగురు పిల్లలున్న ఈ దంపతుల మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. తన భార్యకు మరొకరితో అక్రమ సంబంధం ఉందని, ఈ క్రమంలోనే తన నగ్న వీడియోలను తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ ప్రియుడి ఖాతాలోకి డబ్బులు పంపేలా తనను వేధించిందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

భార్య మొబైల్‌లో దొరికిన ఒక ఆడియో రికార్డింగ్ ద్వారా తన హత్యకు జరుగుతున్న ప్లాన్ బయటపడిందని సదరు వ్యక్తి తెలిపాడు. సుమారు రెండున్నర లక్షల విలువైన ఇంటి సామాగ్రిని కూడా ఆమె తన ప్రియుడికి అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. పరాయి వ్యక్తి కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చాలనుకున్న భార్య ఉదంతం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *