మహారాష్ట్రలో తెల్లవారుజామున 5 గంటల వరకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సర్కార్ కీలక నిర్ణయం

మహారాష్ట్రలో తెల్లవారుజామున 5 గంటల వరకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సర్కార్ కీలక నిర్ణయం

మహారాష్ట్రలో ఈసారి నూతన సంవత్సర వేడుకలు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. డిసెంబర్ 31 రాత్రి హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్ లు మరియు బార్లను జనవరి 1వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు తెరిచి ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని హోం శాఖ ఈ మేరకు శాశ్వత ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ప్రతి ఏటా క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ వేడుకల కోసం ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

అయితే ఈ వెసులుబాటు కేవలం ఇండోర్ వేదికలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలకు ఈ అనుమతి వర్తించదు. శబ్ద కాలుష్య నియమాలను కచ్చితంగా పాటించాలని, భద్రతా బాధ్యతలను ఆయా యాజమాన్యాలే చూసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *