తక్కువ నగలు తెచ్చారని పెళ్లిపీటల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన వధువు మరియు వరుడి బంధువుల బందీ

తక్కువ నగలు తెచ్చారని పెళ్లిపీటల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన వధువు మరియు వరుడి బంధువుల బందీ

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో తక్కువ నగలు తెచ్చారనే కారణంతో వధువు పెళ్లిని నిరాకరించిన ఘటన సంచలనం సృష్టించింది. వరుడి పక్షం వారు తెచ్చిన నగలు చూసి అసంతృప్తి చెందిన వధువు, పెళ్లి మండపం నుండి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, ఆగ్రహించిన వధువు తరపు వారు వరుడిని మరియు అతని సన్నిహిత బంధువులను దాదాపు ఎనిమిది గంటల పాటు బందీలుగా ఉంచారు. దీనితో పెళ్లి వేడుక కాస్తా రసాభాసగా మారింది.

గ్రామ పంచాయతీ సమక్షంలో జరిగిన చర్చల అనంతరం, పెళ్లి ఖర్చుల విషయంలో ఇరుపక్షాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఖర్చులను భరించేందుకు వరుడి తండ్రి అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. చివరకు వధువు లేకుండానే బారాత్ వెనుతిరగాల్సి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదు. ఇరు కుటుంబాలు పరస్పర అంగీకారంతో ఈ సమస్యను పరిష్కరించుకున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *