పెళ్లయిన గంటకే విడాకులు కావాలన్న జంటకు కోర్టు షాకింగ్ తీర్పు

పెళ్లయిన గంటకే విడాకులు కావాలన్న జంటకు కోర్టు షాకింగ్ తీర్పు

చైనాలోని యునాన్ ప్రాంత్నంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక జంట, వివాహమైన కేవలం గంట వ్యవధిలోనే విడాకుల కోసం కోర్టు మెట్లెక్కి అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లయిన వెంటనే మనస్పర్థలు రావడంతో భర్త విడాకులకు పట్టుబట్టగా, భార్య భారీగా నష్టపరిహారం కోరింది. వీరి వాదనలు విన్న న్యాయస్థానం ఎవరూ ఊహించని విధంగా స్పందించింది.

భార్యాభర్తల మధ్య భావోద్వేగ బంధం ఇంకా తెగిపోలేదని అభిప్రాయపడిన జడ్జి, వారి విడాకుల పిటిషన్‌ను కొట్టివేశారు. అంతేకాకుండా, ఇద్దరూ కలిసి హనీమూన్‌కు వెళ్లాలని వింతైన శిక్షను విధిస్తూ తీర్పునిచ్చారు. ప్రస్తుతం ఈ వినూత్న తీర్పు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *