లండన్‌లో భారతీయుడిని బానిస అని అవమానించిన మేనేజర్‌కు కోర్టు గట్టి షాక్ ఇస్తూ 81 లక్షల జరిమానా

లండన్‌లోని ఒక ప్రముఖ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న తమిళనాడుకు చెందిన మధేష్ రవిచంద్రన్‌ను అక్కడి మేనేజర్ ‘బానిస’ అని పిలుస్తూ జాతి వివక్షతో దూషించాడు. శ్రీలంకకు చెందిన ఆ మేనేజర్ భారతీయులను మోసగాళ్లుగా అభివర్ణించడమే కాకుండా, రవిచంద్రన్‌ను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించాడు. ఈ అవమానంపై బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, విచారణ చేపట్టిన కోర్టు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది.
రవిచంద్రన్‌పై జరిగిన జాతి వివక్ష దాడి నిజమని నిర్ధారించిన న్యాయమూర్తి పాల్ అబాట్, నిందితుడైన మేనేజర్‌కు సుమారు 81.34 లక్షల రూపాయల (67 వేల పౌండ్లు) భారీ జరిమానా విధించారు. బాధితుడికి ఈ మొత్తాన్ని పరిహారంగా చెల్లించాలని ఆదేశిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి జాత్యహంకార వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు హెచ్చరించింది. విదేశాల్లో భారతీయుల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ తీర్పు స్పష్టం చేసింది.