హోటల్ రూమ్ నుండి ఈ వస్తువులు తెస్తున్నారా? భారీ జరిమానా పడే అవకాశం ఉంది జాగ్రత్త

పర్యాటక ప్రాంతాల్లో హోటల్ గదుల్లో ఉన్నప్పుడు అక్కడ లభించే సౌకర్యాల పట్ల అవగాహన ఉండాలి. రూమ్‌లోని కొన్ని వస్తువులను మీరు ఉచితంగా ఇంటికి తీసుకెళ్లవచ్చు, కానీ కొన్నింటిని తాకితే భారీ జరిమానా తప్పదు. బాత్రూమ్లోని చిన్న షాంపూ బాటిల్స్, సోపులు, కాఫీ మరియు టీ ప్యాకెట్లు, పేపర్ నాప్కిన్లు, డిస్పోజబుల్ స్లిప్పర్లను మీరు నిశ్చింతగా తీసుకోవచ్చు. ఇవి అతిథుల సౌకర్యం కోసం కేటాయించినవి.
అయితే, హోటల్ బెడ్ షీట్లు, తువ్వాళ్లు (Towels), దిండ్లు లేదా బాత్రోబ్లను తీసుకెళ్లడం నిషిద్ధం. ఇవి తిరిగి ఉపయోగించే వస్తువులు కాబట్టి వీటిని తీసుకుంటే మీ బిల్లులో అదనపు ఛార్జీలు వేస్తారు. అలాగే రూమ్‌లోని గ్లాసులు, కప్పులు లేదా అలంకరణ వస్తువులను దొంగిలించడం నేరంగా పరిగణించబడుతుంది. ఇలాంటి పనులు చేస్తే సదరు హోటల్ మిమ్మల్ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి చెక్-అవుట్ చేసే ముందు ఏవి మీవో, ఏవి హోటల్ ఆస్తో తెలుసుకోవడం ముఖ్యం.