తెల్లగా కాకుండా టూత్‌పేస్ట్ మాదిరిగా చిక్కగా ఉండే నీలి రంగు పాలు ఇచ్చే వింత జంతువు గురించి మీకు తెలుసా

తెల్లగా కాకుండా టూత్‌పేస్ట్ మాదిరిగా చిక్కగా ఉండే నీలి రంగు పాలు ఇచ్చే వింత జంతువు గురించి మీకు తెలుసా

ప్రపంచంలోనే అత్యంత చిక్కటి పాలు ఇచ్చే జీవి తిమింగలం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పాలు తెల్లగా కాకుండా నీలి రంగులో టూత్‌పేస్ట్ మాదిరి చిక్కగా ఉంటాయి. సాధారణ ఆవు పాలలో 4 శాతం కొవ్వు ఉంటే తిమింగలం పాలలో ఏకంగా 35 నుండి 50 శాతం వరకు కొవ్వు ఉంటుంది. ఈ పాలు నీటిలో కరగవు కాబట్టి పిల్ల తిమింగలాలు సముద్ర గర్భంలో కూడా సులభంగా పాలు తాగగలుగుతాయి.

తల్లి తిమింగలం రోజుకు సుమారు 200 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ పాలను తాగడం వల్ల పిల్ల తిమింగలాలు రోజుకు సగటున 100 కిలోల బరువు పెరుగుతాయి. 2025లో జరిగిన పరిశోధనల ప్రకారం ఈ పాలలో గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయని తేలింది. సుదూర ప్రయాణాలు చేయడానికి అవసరమైన శక్తిని ఈ పాలు పిల్ల తిమింగలాలకు అందిస్తాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *