వందే భారత్ తో పాటు అన్ని రైళ్ల ఛార్జీలు పెరిగాయి సామాన్యులపై ఎంత భారం పడనుందో తెలుసుకోండి

వందే భారత్ తో పాటు అన్ని రైళ్ల ఛార్జీలు పెరిగాయి సామాన్యులపై ఎంత భారం పడనుందో తెలుసుకోండి

భారతీయ రైల్వే నేడు డిసెంబర్ 26 నుండి ప్రయాణికుల ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. వందే భారత్, రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం రైళ్లతో పాటు స్లీపర్ మరియు ఏసీ క్లాస్ టికెట్ ధరలు కూడా పెరిగాయి. కొత్త నిబంధనల ప్రకారం, జనరల్ బోగీల్లో 215 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరానికి కిలోమీటరుకు 1 పైసా, ఏసీ మరియు మెయిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో కిలోమీటరుకు 2 పైసల చొప్పున ఛార్జీలు పెరగనున్నాయి. డిసెంబర్ 26 తర్వాత బుక్ చేసుకునే టిక్కెట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

దూరాన్ని బట్టి స్లాబ్ల వారీగా 5 రూపాయల నుండి 20 రూపాయల వరకు ధరలు పెరిగాయి. ఉదాహరణకు 500 కిలోమీటర్ల ప్రయాణానికి అదనంగా 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ తేదీ కంటే ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి పాత ధరలే వర్తిస్తాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది. మెరుగైన భద్రత మరియు నాణ్యమైన సదుపాయాలను అందించే ఉద్దేశంతోనే ఈ ఛార్జీల పెంపు చేపట్టినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *