మరణించిన వారితో మాట్లాడించే అద్భుత ఫోన్ బూత్ జపాన్ కొండల్లోని ఈ విండ్ ఫోన్ వెనుక ఉన్న అసలు కథ ఇదే

మరణించిన వారితో మాట్లాడించే అద్భుత ఫోన్ బూత్ జపాన్ కొండల్లోని ఈ విండ్ ఫోన్ వెనుక ఉన్న అసలు కథ ఇదే

జపాన్‌లోని ఓత్సుచి నగరంలో ‘విండ్ ఫోన్’ అనే ఒక వింతైన ఫోన్ బూత్ ఉంది. 2010లో ఇతారు ససాకి అనే వ్యక్తి క్యాన్సర్‌తో తన బంధువును కోల్పోయిన బాధలో దీనిని ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు ఎటువంటి కనెక్షన్ ఉండదు, కానీ చనిపోయిన తమ ప్రియమైన వారితో మనసు విప్పి మాట్లాడటానికి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఇది కేవలం మాటలు చెప్పుకోవడానికే కాదు, వారిని కోల్పోయిన బాధ నుండి బయటపడటానికి ఒక మార్గంగా ఉపయోగపడుతుంది.

కొండపై నిర్మించిన ఈ బూత్ నుండి నగరం మొత్తం కనిపిస్తుంది. గాలి వీచినప్పుడు ఆ ఫోన్ నుండి వచ్చే వింత శబ్దాలు చనిపోయిన వారి గొంతులా అనిపిస్తాయని ససాకి చెబుతారు. సాధారణ ఫోన్లలో చెప్పలేని మనసులోని మాటలను ఈ నిర్జన ప్రదేశంలో చెప్పుకుని ప్రజలు ఊరట చెందుతున్నారు. ప్రస్తుతం ఈ వింత ఫోన్ బూత్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *