మూడేళ్లలో మూడు పెళ్లిళ్లు చేసుకున్న బీహార్ యువకుడు భార్యలకు వంట రాదంటూ వింత వాదన

మూడేళ్లలో మూడు పెళ్లిళ్లు చేసుకున్న బీహార్ యువకుడు భార్యలకు వంట రాదంటూ వింత వాదన

బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో వరుస పెళ్లిళ్లతో వార్తల్లో నిలిచిన పింటూ బర్న్వాల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మూడేళ్ల వ్యవధిలోనే ముగ్గురు మహిళలను వివాహం చేసుకున్న ఇతనిపై మొదటి ఇద్దరు భార్యలు గృహహింస మరియు వరకట్న వేధింపుల కేసులు నమోదు చేశారు. చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండానే ఇతర వివాహాలు చేసుకున్నాడని, అదనపు కట్నం కోసం తమను వేధించి ఇంటి నుండి పంపించేశాడని వారు ఆరోపించారు.

అయితే ఈ ఆరోపణలను పింటూ ఖండించారు. తన భార్యలకు వంట చేయడం రాదని, అందుకే తాను మళ్ళీ పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందని వింత సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా తన భార్యలే తనను చంపడానికి కుట్ర పన్నారని ఎదురుదాడికి దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *